KDP: బద్వేల్ మున్సిపాలిటీ విస్తరణతో పట్టణ రూపురేఖలు మారాయి. గతంలో 26 వార్డులు ఉండగా, కొత్తగా 9 వార్డులు చేరడంతో మొత్తం వార్డుల సంఖ్య 35కు చేరింది. పురపాలక పరిధిలో మొత్తం 52,776 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వార్డుల పునర్విభజనతో పలు కాలనీలు ఇతర వార్డుల్లోకి మారాయి. ఓటర్ల వివరాలు, వార్డుల సరిహద్దులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్ మున్సిపాలిటీలో 9 కొత్త వార్డులు


