హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వెంట్రప్రగడలో వైభవం.. కోలాటాల సందడి

కృష్ణా: పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడి విగ్రహానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మహిళలు గోమాతకు పూజలు గావించారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. మహిళల కోలాటం, విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి.