హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోటళ్లపై VMC ప్రజారోగ్య అధికారుల తనిఖీలు

NTR: విజయవాడ కెనాల్ రోడ్డులో శుక్రవారం VMC ప్రజారోగ్య అధికారులు పలు హోటళ్లను తనిఖీ చేశారు. కిచెన్లలో అపరిశుభ్రత, ఆహార పదార్థాలపై మూతలు లేకపోవడం వంటి లోపాలను గుర్తించి, నిబంధనలు పాటించని మూడు హోటళ్లకు రూ.5 వేల చొప్పున జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు. గడువులోగా లోపాలు సరిచేయకుంటే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.