హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో ట్రాఫిక్ సీఐ ఎస్.రాము పట్టణంలోని పలు ప్రాంతాల్లో మైనర్ డ్రైవింగ్‌పై శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. 18 ఏళ్లు నిండకుండా వాహనాలు ఇస్తే చట్టప్రకారం తల్లిదండ్రులదే పూర్తి బాధ్యతని, వారిపైనే చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు.