హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోకులంలో నూతన కృష్ణుడి విగ్రహం

SS: శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం గోకులం వద్ద కృష్ణాష్టమి సందర్భంగా నూతన కృష్ణుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్, గ్లోబల్ కౌన్సిల్ ఛైర్మన్ కె.చక్రవర్తి విగ్రహాన్ని ప్రారంభించారు. తుఫాను వల్ల పాత విగ్రహం దెబ్బతినడంతో కొత్తది ఏర్పాటు చేశారు. అనంతరం సిబ్బందికి వస్త్రాలు పంపిణీ చేశారు.