హైదరాబాద్: 28°C
వ్యాపారం

'కెన్యా యూనిట్‌లో సమస్య పరిష్కారానికి సిద్ధం'

కెన్యాలోని టాటా కెమికల్స్ కార్యకలాపాలు నిలిపేయాలని ఆ దేశాధ్యక్షుడు విలియం హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనిపై టాటా కెమికల్స్‌ స్పందించింది. ఆ యూనిట్‌లో సమస్యను చట్టబద్ధంగా పరిష్కరించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్లు వెల్లడించింది. పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.