హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటకుల కారు బోల్తా.. ప్రయాణికులు సురక్షితం

VKB: ధారూర్‌ మండలం బాచారం గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద హైదరాబాద్‌ నుంచి కోటిపల్లి ప్రాజెక్టుకు వెళ్తున్న పర్యాటకుల కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం నుంచి వారు సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.