హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్

BDK: ఆరు గ్యారెంటీల పేరుతో అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను నిలువున వంచిస్తోందని మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విఫల పాలనకు నిరసనగా దమ్మపేట ప్రధాన రహదారి పై 'వంట వార్పు' నిర్వహించి నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే ఈ ఉద్యమ బాట పట్టామన్నారు. తక్షణమే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.