హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇస్కాన్ టెంపుల్‌కు పోటెత్తిన భక్తులు

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాంపూర్ గ్రామ సమీపంలోని ఇస్కాన్ టెంపుల్‌కు శుక్రవారం భక్తులు పోటెత్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పండుగ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.