KMM: వైరా ఎక్సైజ్ సీఐగా కె.నాగయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన సీఐ మమత బదిలీ కావడంతో వరంగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న నాగయ్యను ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు చేపట్టిన నూతన సీఐకి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అక్రమ మద్యం, నాటుసారా రవాణాపై ఉక్కుపాదం మోపుతామని నాగయ్య హెచ్చరించారు.
తెలంగాణ
ఎక్సైజ్ సీఐగా కె.నాగయ్య బాధ్యతలు


