హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లల కోసం మట్టి గణపతి వర్క్‌షాప్

RR: పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అనిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సంయుక్తంగా 6-16 ఏళ్ల పిల్లల కోసం మట్టి గణపతి తయారీ వర్క్‌షాప్ నిర్వహించనున్నాయి. రేపు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నల్లగండ్ల అశోకవనం రాక్ గార్డెన్‌లో కార్యక్రమం జరుగుతుంది. ప్రవేశం ఉచితం. సామగ్రిని నిర్వాహకులే అందిస్తారు.