హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద రైతు కుటుంబ విద్యార్థినికి MBBS సీటు

NGKL: లింగాల (మం) కొత్తకుంటపల్లికి చెందిన సౌడమోని మంజుల నీట్‌లో 467 మార్కులు, 67,688 ర్యాంక్ సాధించి హైదరాబాద్ బాచుపల్లిలోని మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో MBBS సీటు పొందింది. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన మంజుల ప్రభుత్వ పాఠశాల, కేజీబీవీ, గురుకులంలో చదివింది. ఆమె విజయంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.