ADB: కాంగ్రెస్ పాలన 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో గుడిహత్నూర్ నుంచి ఇచ్చోడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మహిళలకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీల హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కాంగ్రెస్ వైఫల్యాలపై పోరుబాట


