హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ కృష్ణ రుక్మిణిలకు నూతన వస్త్రాల సమర్పణ

MDK: రామాయంపేట పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను యాదవ సహోదరులు ఘనంగా నిర్వహించారు. స్వామివారు, రుక్మిణి అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయంలో నామస్మరణలు మిన్నంటాయి. ఈ కార్యక్రమంలో స్థానిక యాదవ సంఘం నాయకులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.