హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఒరాకిల్‌లో కీలక ఉద్యోగుల 'స్లాక్' ఖాతాలు మాయం

ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్‌లో కీలక ఉద్యోగుల 'స్లాక్' ఖాతాలు మాయమయ్యాయి. ఒరాకిల్ అప్లికేషన్ ల్యాబ్స్ టీమ్‌లోనీ వీపీ, జీవీపీలను తొలగించినట్లు తెలుస్తోంది. మార్చిలో 10,000 మందికి పైగా ఉద్యోగులకు తొలగింపు ఇమెయిల్‌లు పంపగా, ఇప్పుడు సైలెంట్‌గా స్లాక్ ఖాతాలు తొలగిస్తోంది. లేఆఫ్‌ల ప్రభావం భారత్ సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేసే మేనేజర్లపైనా పడే అవకాశముంది.