హైదరాబాద్: 28°C
వ్యాపారం

అడోబ్‌ సీఈవోగా మళ్లీ భారతీయుడే

అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్ సీఈవో పగ్గాలు మళ్లీ భారతీయుడికే దక్కాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా సీఈవోగా ఉన్న శంతను నారాయణ్ ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు కంపెనీ మార్చి నెలలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కంపెనీ నూతన సీఈవోగా అనిల్ చక్రవర్తి నియమితులయ్యారు. డిసెంబర్ 1న అనిల్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.