హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్

KMM: నవ శకం ఆధ్వర్యంలో మధిర మండలం దెందుకూరు గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని సర్పంచ్ పగిడిపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఝాన్సీ ప్రసాద్ పాల్గొన్నారు.