SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గోకులాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. రాధాకృష్ణులు, గోపికల వేషధారణలతో చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, ఒగ్గు పూజారులు, యాదవులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
శోభాయమానంగా మల్లికార్జున స్వామి శోభాయాత్ర


