హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీసీ కులాల సమగ్ర లెక్కలు చేపట్టాలి!

HNK: 2027 జనాభా లెక్కల్లో దేశవ్యాప్తంగా ఉన్న BC కులాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కోడ్ కేటాయించి సమగ్రంగా కులాల వారీగా లెక్కించాలని BC ఇంటలెక్చువల్స్ ఫోరం హనుమకొండ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం HNK ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీసీల సాధికారతకు సమగ్ర కులగణన అవసరమని పేర్కొన్నారు.