BHNG: యాదగిరిగుట్ట మండలం కొత్తగుండ్లపల్లి చెరువులో చేపల వేటకు వెళ్లిన ముక్కెర్ల సత్తయ్య గురువారం సాయంత్రం గల్లంతయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. చెరువు కట్టపై మేకల మందతో ఉన్న సత్తయ్య వలతో చేపలు పట్టేందుకు చెరువులోకి వెళ్లారు. కొద్దిసేపటికే కనిపించకుండా పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇవాళ కుడా సత్తయ్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు!


