హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం ఆగదు: గండ్ర

BHPL: సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన తనను గేట్లు వేసి అడ్డుకోవడం సరికాదని మాజీ MLA గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి సింగరేణి ఏరియా 5 ఇంక్లైన్ వద్ద గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కార్మికులకు షూస్, పనిముట్లు, అవసరమైన సామగ్రి సక్రమంగా అందడం లేదన్నారు. సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.