హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సురక్షా బస్టాండ్‌ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు

BDK: మణుగూరు మండల కేంద్రంలోని సురక్షా బస్టాండ్‌ సమీపంలో రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన మున్సిపాలిటీ సిబ్బంది శుక్రవారం గుంతలను పూడ్చే పనులు చేపట్టారు. గుంతలు పూడ్చడంతో రాకపోకలకు ఇబ్బందులు తగ్గుతాయని స్థానికులు తెలిపారు. రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.