SRD: జిన్నారం మండలం బొల్లారం డివిజన్ విద్యుత్ శాఖ ఏడీఈగా టి.కల్యాణి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఏడీఈగా పనిచేసిన మాధవరావు ఉద్యోగ విరమణ చేయడంతో ఆమెను బదిలీపై నియమించారు. పారిశ్రామికవాడలో వినియోగదారులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తానని కల్యాణి తెలిపారు. విద్యుత్ సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
ఐడిఏ బొల్లారం ఏడీఈగా కల్యాణి బాధ్యతలు


