హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోగుళాంబ అమ్మవారికి లక్ష గాజులతో విశేష అలంకరణ

GDWL: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం నాలుగో శుక్రవారాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆలయ ఈఓ దీప్తి అర్చక బృందం ఆధ్వర్యంలో శ్రీ జోగుళాంబ అమ్మవారికి లక్ష గాజులతో నయన మనోహరంగా విశేష అలంకరణ చేశారు. వీటితోపాటు జోగులాంబ చండీ హోమం త్రిశతి అర్చన పూజలు ఘనంగా నిర్వహించారు.