KDP: సిద్దవటం మండలం మాధవరం-1లోని శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మంగళ గౌరీ దేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అర్చకుడు జింకా సాంబయ్య అమ్మవారికి జలాభిషేకం, కుంకుమార్చన, వంటిపలు అభిషేకాలను నిర్వహించి పూలతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
భక్తి శ్రద్ధలతో మంగళ గౌరీదేవికి పూజలు


