హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సమస్యపై ఆర్డీవోకు వినతి

ATP: గుంతకల్లులో తాగునీటి సమస్య తీర్చాలని కోరుతూ BJP నాయకులు స్థానిక ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. పట్టణంలో వర్షపాతం తగ్గి వారానికోసారి నీరు వదులుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పనిచేయని బోర్లు, సింటెక్స్ ట్యాంకులకు మరమ్మతులు చేయించి, అవసరమైన చోట కొత్త బోర్లు వేయాలని కోరారు. స్పందించిన ఆర్డీవో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.