SKLM: పాతపట్నం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ మరమ్మత్తు పనులు కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ ఇ.నరసింహకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దశరథ పురం, కోదూరు, చంగుడి పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో ఉ. 9 గంటల నుంచి మ. 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని స్పష్టం చేశారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఈ ప్రాంతాలలో పవర్ కట్


