హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటి నుంచి వచ్చిన బాలికకు శక్తి టీం రక్షణ

ELR: తల్లిదండ్రులు మందలించారనే కోపంతో ఇల్లు వదిలి వచ్చిన ఒక బాలికను ఏలూరు ‘శక్తి టీం’ పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ పరిధికి చెందిన బాలిక ఏలూరులో గస్తీ నిర్వహిస్తున్న 'శక్తి టీం' సభ్యులకు తారసపడింది. బాలిక వద్ద నుంచి వివరాలు సేకరించి సురక్షితంగా తల్లిదండ్రులకి అందజేశారు. పిల్లలను తల్లిదండ్రులు గమనించాలన్నారు.