PLD: నరసరావుపేటలోని ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల హరినామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి


