హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభించి 10 రోజులు.. సేవలు నిల్!

WNP: దావాజిపల్లి స్టేజీ సమీపంలో రూ.2.14 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మంత్రులు ప్రారంభించినా, పది రోజులు గడిచినా విద్యుత్ సేవలు అందుబాటులోకి రాలేదు. దీంతో లోఓల్టేజీ సమస్య తీరుతుందని ఆశించిన రైతులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేటర్ లేకపోవడంతో ఆలస్యమైందని ట్రాన్స్‌కో ఏఈ తెలిపారు. త్వరలో సేవలు ప్రారంభిస్తామని వెల్లడించారు.