హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీకృష్ణ జన్మభూమిలో జన్మాష్టమి వేడుకలు

శ్రీకృష్ణ జన్మభూమి మధురలో జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు, మంగళహారతితో వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచే ఆలయానికి వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. హరే కృష్ణ నామస్మరణతో మధుర నగరం మార్మోగుతోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఆలయ అధికారులు అన్ని వసతులు కల్పించారు.