హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నదాన ట్రస్ట్‌కు దాతల చేయూత

కోనసీమ: ఆత్రేయపురం(M) వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు శుక్రవారం మండపేట వాస్తవ్యులు వంక నరేంద్ర బాబు, సుజాత వారి కుటుంబ సభ్యులు రూ.1,00,111 విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. అనంతరం ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.