హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

గద్వాల జిల్లా జమ్మిచేడులోని శ్రీ జమ్ములమ్మ దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణా నది పవిత్ర జలాలతో అభిషేకం, ఆకుపూజ, హోమం తదితర వైదిక కార్యక్రమాలు జరిపించారు. పవిత్ర శ్రావణ మాసం కావడంతో అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.