హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'సీపీఆర్ శిక్షణతో ప్రాణాపాయాల నుంచి రక్షణ'

ELR: చింతలపూడి జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో సర్కిల్ పోలీస్ సిబ్బందికి CPR పై అవగాహన నిర్వహించారు. ఏలూరు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ప్రియాంక స్పృహ కోల్పోయిన వ్యక్తిని 'గోల్డెన్ అవర్'లో CPR ద్వారా ఎలా రక్షించవచ్చో వివరంగా ప్రదర్శించారు. ప్రమాదాల సమయంలో పోలీసులే మొదటగా సంఘటనా స్థలానికి చేరుకుంటారు కాబట్టి ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు.