హైదరాబాద్: 28°C
తెలంగాణ

బిల్లులు రాక.. వదిలేసిన వైనం

MDK: వెల్దుర్తిలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో 500 మంది చదువుకుంటున్నారు. వీరి కోసం మూడేళ్ల కిందట 'మన ఊరు- మన బడి పథకం కింద భోజనశాల నిర్మించారు. దానికి సంబంధించిన బిల్లు రాలేదని గుత్తేదారు దాన్ని పాఠశాలకు అప్పగించలేదు. దీంతో విద్యార్ధులు బడి వరాండాలో భోజనాలు చేస్తున్నారు. సదరు భవనంలో ఫర్నిచర్, నీటి వసతి కల్పించి, బిల్లు చెల్లిస్తే అందుబాటులోకి వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.