హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్ది విగ్రహ గద్దె కూల్చివేత!

WGL: ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఇవాళ తెల్లవారుజామున ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు నిర్మిస్తున్న గద్దెను గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడంతోనే చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.