హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోదాడలో ప్రారంభమైన రోడ్డు నిర్మాణ పనులు

SRPT: కోదాడ పట్టణంలోని నాగార్జున లాడ్జి నుంచి అనంతగిరి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. 6.6 కి.మీ. మేర రూ.30 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. రోడ్డు విస్తరణ పూర్తయితే 40 గ్రామాల ప్రజల రాకపోకలు సులభతరం కానున్నాయి.