హైదరాబాద్: 28°C
తెలంగాణ

డెయిరీ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

KMR: డైయిరీ టెక్నాలజీ కళాశాలలో బీటెక్‌ డైయిరీ టెక్నాలజీ కోర్సులో 17 సీట్లకు ఈ నెల 8న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు అసోసియేట్‌ డీన్‌ డా. సురేశ్ రాథోడ్‌ తెలిపారు. HYD రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో ఉ.10 గంటలకు కౌన్సెలింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన ఎంపీసీ విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.