హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సస్పెండ్

TPT: భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎన్. వెంకటరమణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. భాకరాపేట చెక్పోస్ట్ వద్ద రూ. 50 లక్షల విలువైన అక్రమ సిగరెట్లను సీజ్ చేసిన ఆయన, వాటిని గుట్టుచప్పుడు కాకుండా ఇతరులకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టారు. ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.