హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటల సర్వే పారితోషికం పెంచాలని వినతి

MLG: జిల్లాలో చేపట్టనున్న డిజిటల్ పంట సర్వేకు ఇచ్చే పారితోషికాన్ని రూ. 7 నుంచి రూ. 15 కు పెంచాలని సర్వేయర్లు కోరారు. గురువారం ములుగులో DAO సురేష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. గ్రామాల్లోని సాగు భూములకు నేరుగా వెళ్లి విషపురుగులున్నా పంట పొలాల్లో తిరుగుతూ సర్వే చేస్తున్నామని తెలిపారు. తమ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పారితోషికం పెంచాలన్నారు.