హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణుని మార్గం సర్వులకూ మార్గదర్శకం: మంత్రి

ATP: ధర్మ సంరక్షణకు అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ బోధనలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శ్రీకృష్ణుని దివ్య ఆశీస్సులతో సమాజంలో శాంతి, సామరస్యం, సుభిక్షం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణుని మార్గం సర్వులకూ మార్గదర్శకమని అన్నారు.