హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

PLD: కారంపూడి మండలం పెట్సానిగల్ల గ్రామం సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన షోరైనాయక్ ఇంటికి వెళ్తుండగా, వెంకటరెడ్డిపురానికి చెందిన హనుమంతు నాయక్ వాహనం ఎదురెదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షోరైనాయక్ కాలు విరగగా, హనుమంతు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.