హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు శ్రీ భ్రమరాంబ దేవికి లక్ష గాజుల అలంకారం

GNTR: శ్రావణమాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబ దేవి అమ్మవారు శుక్రవారం లక్ష గాజుల అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఆలయ కళ్యాణ మండపంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిప్యూటీ కమిషనర్ లీలా కుమార్ తెలిపారు. పాల్గొనే మహిళలకు పసుపు, కుంకుమ, రవికె గుడ్డ, అష్టలక్ష్మి రూపును ప్రసాదంగా అందించి, అనంతరం అన్నప్రసాద వితరణ చేయనున్నారు.