హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్ప్రింక్లర్ల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్: SI

ADB: ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని తంతోలి గ్రామానికి చెందిన రైతు రవి పొలంలో ఐదు స్ప్రింక్లర్లు చోరీకి గురయ్యాయి. చింతగూడకు చెందిన నగేశ్ దొంగతనం చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన SI విష్ణువర్ధన్ నిందితుడిని విచారించగా చోరీని అంగీకరించడంతో, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.