ప్రకాశం: తాళ్లూరు(M) బొద్దికూరపాడు, వెలుగువారిపాలెం గ్రామాల్లో రీ-సర్వేపై గ్రామసభ నిర్వహించారు. రైతుల భూములకు హద్దులు ఏర్పాటు చేసి, అధికారికంగా శాశ్వత పరిష్కారం చూపుతామని ఆర్‌ఐ సుధీర్ తెలిపారు. సమస్యలు ఉన్నవారు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు. రీ-సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ మహేశ్, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రీ-సర్వే సమస్యలు పరిష్కరించుకోండి'


