హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతు ఆత్మహత్యపై సీపీఎం ఆగ్రహం

అన్నమయ్య: మదనపల్లె మండలం కోటవారిపల్లికి చెందిన కౌలు రైతు జయసింహ (28) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంపై సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టమాటాకు గిట్టుబాటు ధర, పంట బీమా అందక రైతులు నష్టపోతున్నారని అన్నారు. మృతుని కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.