హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గరుడ వాహనంపై వేణుగోపాలస్వామి

TPT: దుర్గసముద్రం గోవర్ధనగిరిపై కొలువైన శ్రీ చిన్మయ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారిని గరుడ వాహనంపై విశేషంగా అలంకరించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. మంగళ వాయిద్యాల నడుమ, భక్తుల గోవింద నామస్మరణలతో గరుడ సేవ భక్తిశ్రద్ధలతో సాగింది.