హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 27 మంది కానిస్టేబుళ్లకు హెచ్‌సీలుగా పదోన్నతి

GNTR: గుంటూరు జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న 1996, 1998, 2000, 2009 బ్యాచ్‌లకు చెందిన 27 మంది సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన సిబ్బంది ఎస్పీని మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్ఛం అందజేసి తమ కృతజ్ఞతలు తెలిపారు.