హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనగాలలో డెంగీ  పాజిటివ్

BPT: చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో ఓ మహిళకు డెంగీ పాజిటీవ్ రావడంతో, ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు బాధితురాలి నివాసాన్ని ఆరోగ్యశాఖ సిబ్బందితో కలిసి పరిశీలించారు. డెంగీ జ్వరం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గినప్పటికి సరైన చికిత్స అందిస్తే త్వరగా కోలుకుంటారని, ఎవ్వరూ భయపడొద్దని దైర్యం చెప్పారు.