NDL: ప్యాపిలి మండల పరిధిలోని మాధవరం గ్రామ పూర్వపు గ్రామ రెవెన్యూ అధికారి(VRO) ఎం.మల్లారెడ్డి సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వ, అసైన్డ్, గ్రామకంఠం భూముల బదలాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గురువారం కలెక్టర్ రాజకుమారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన డోన్ క్లస్టర్-1లో VROగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VRO మల్లారెడ్డిపై సస్పెన్షన్ వేటు


